నా తల్లి పరిస్థితి ఇదీ... కాపాడుకునే ప్రయత్నాలను అడ్డుకున్న మహిళా పోలీస్: ఎమ్మెల్యే సీతక్క ఆవేధన

హైదరాబాద్: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, గిరిజనుల కష్టాలను దూరంచేయడానికి ప్రయత్నిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా పోలీసుల నుండి కష్టాలు తప్పలేదు. 

First Published Jun 3, 2021, 12:34 PM IST | Last Updated Jun 3, 2021, 12:34 PM IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, గిరిజనుల కష్టాలను దూరంచేయడానికి ప్రయత్నిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా పోలీసుల నుండి కష్టాలు తప్పలేదు. తన తల్లి చావుబ్రతుకులతో పోరాడుతూ ఐసియూలో చికిత్స పొందుతుంటే మల్కాజిగిరి డిసిపి రక్షిత కనీస మానవత్వాన్ని కూడా చూపకుండా దురుసుగా ప్రవర్తించారని...  బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వెలుతున్న తమ కుటుంబ సభ్యులను అడ్డుకున్నారని సీతక్క తెలిపారు. మా అమ్మ పరిస్థితి సీరియస్ గా వుంది... దయచేసి వారిని పంపించండి అని స్వయంగా తానే వీడియో కాల్ ద్వారా కోరినా డిసిపి పట్టించుకోలేదని... తమవారిని అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సేవకురాలు, ఎమ్మెల్యే అయిన తనకే ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే  సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి... అని సీతక్క డిసిపి తీరును తప్పుబట్టారు.