ఎమ్మెల్యే రాజాసింగ్ రాకతో గోషామహల్ లో సంబరాలు...
హైదరాబాద్ : రెండునెలలకు పైగా చర్లపల్లి సెంట్రల్ జైల్లో వుండి నిన్న(బుధవారం) రాత్రి బెయిల్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ బయటకు వచ్చిన విషయం తెలసిందే.
హైదరాబాద్ : రెండునెలలకు పైగా చర్లపల్లి సెంట్రల్ జైల్లో వుండి నిన్న(బుధవారం) రాత్రి బెయిల్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ బయటకు వచ్చిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ లో బిజెపి శ్రేణులు, ఎమ్మెల్యే అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటివద్దకు భారీగా చేరుకున్న స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి హంగామా చేసారు. గోషామహల్ ప్రాంతంలో అక్కడక్కడా టపాసులు కాల్చి రాజాసింగ్ పై అభిమానాన్ని చాటుకున్నారు కొందరు యువకులు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి ఆగస్ట్ 25న పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పటినుండి చర్లపల్లి జైల్లో వున్న అతడికి తాజాగా బెయిల్ లభిచింది. ఆయనపై పిడి యాక్ట్ ను ఎత్తివేసిన హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే జైలు నుండి విడుదలైన రాజాసింగ్ కు అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.