Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల ... జై శ్రీరామ్ నినాదాలతో యువకుల హంగామా

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండునెలల తర్వాత చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి విడుదలైన నేపథ్యంలో కొందరు యువకులు హల్ చల్ చేసారు.

First Published Nov 10, 2022, 11:25 AM IST | Last Updated Nov 10, 2022, 11:25 AM IST

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండునెలల తర్వాత చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి విడుదలైన నేపథ్యంలో కొందరు యువకులు హల్ చల్ చేసారు. జైలు నుండి విడుదలైన రాజాసింగ్ కారులో బయటకు వెళుతుండగా జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ వెంటపడ్డారు. పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసిన ముందుకెళ్లి ఎమ్మెల్యేతో కరచాలనం చేసారు. జైలువద్ద వున్న యువకులకు అభివాదం చేస్తూ ఏమీ మాట్లాడుకుండానే వెళ్లిపోయారు రాజాసింగ్. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టి ఆగస్ట్ 25న పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పటినుండి చర్లపల్లి జైల్లో వున్న అతడికి తాజాగా బెయిల్ లభిచింది. ఆయనపై పిడి యాక్ట్ ను ఎత్తివేసిన హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే జైలు నుండి విడుదలపై తమ అభిమాన నాయకుడిని కలిసేందుకు కొందరు యువకులు చర్లపల్లి వద్దకు చేరుకుని హంగామా చేసారు.