కరోనా పాజిటివ్ వ్యక్తికి కాలు విరగటంతో పీపీఈ కిట్స్ తో ఇంట్లోనే చికిత్స చేయించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడగా తలకు తీవ్రగాయమై కాలు విరిగింది.
జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన గీత కార్మికుడు శంకర్ గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడగా తలకు తీవ్రగాయమై కాలు విరిగింది.అయితే కరీంనగర్ లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందగా కరోనా పాజిటివ్ గా తేలింది.దీంతో ఇంటి వద్దే హోం ఐసోలేషన్ లో ఉంటున్న శంకర్ గౌడ్ ఇటు తలకు గాయం,కాలు విరగటంతో నరకయాతన అనుభవిస్తున్నాడు..స్దానికులు,గ్రామస్దుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆర్దోపెడిక్ వైద్యుడు నవీన్,అసిస్టెంట్ రవికిరణ్ తో కలిసి పీపీఈ కిట్స్ ధరించి అంతర్గాంలోని శంకర్ గౌడ్ ఇంట్లోనే కాలుకు చికిత్స అందించగా కాస్త ఉమశమనం పొందాడు.