Telangana News: కులాల పేరుతో విడదీసారని... మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డురాని కులం పెళ్లికి అడ్డువచ్చేసరికి తట్టుకోలేక మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డురాని కులం పెళ్లికి అడ్డువచ్చేసరికి తట్టుకోలేక మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ప్రియురాలితో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మొదట యువకుడు... అతడి చావువార్త విని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా కేవలం గంటల వ్యవధిలోని ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి.
సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన మైనర్లు శివ, సుస్మిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల ఇరుకుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. కులాలు వేరు కాబట్టి పెళ్లి చేయలేమని పెద్దలు చెప్పడంతో జీవితాంతం కలిసి బ్రతలేమని తెలిసిపోయింది. దీంతో మొదట శివ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా... ఈ వార్త విని సుస్మిత గ్రామశివారులోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.