తొమ్మిదేళ్ళ చిన్నారిపై 38ఏళ్ల కామాంధుడు అత్యాచారం... తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్లో బాలిక
పెద్దపల్లి: అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
పెద్దపల్లి: అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. జమ్మికుంట మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక (9ఏళ్లు) వేసవి సెలవుల్లో ఓదేలు మండలంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఈ గ్రామానికి చెందిన శిలారపు రమేష్(38) పాపపై కన్నేసిన ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నీచుడి వికృత చేష్టలతో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యంకోసం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చిన్నారిపై అత్యాచారం గురించి తెలియడంతో వెంటనే పెద్దపల్లి ఏసిపి సారంగపాని హాస్పిటల్ కు చేరుకుని పరామర్శించారు. బాధిత చిన్నారి కుటుబసభ్యులతో మాట్లాడి ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసామని... పరారీలో వున్న అతడి కోసం గాలిస్తున్నట్లు ఏసిపి తెలిపారు.