ముందస్తు ఎన్నికలకు మీరు సిద్దమైతే మేమూ సిద్దమే...: బిజెపికి మంత్రులు వేముల, తలసాని సవాల్
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఉదయం సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావిని పరిశీలించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఉదయం సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావిని పరిశీలించారు. నిజాం కాలంనాటి మెట్ల బావి విశిష్టతను మంత్రి ప్రశాంత్ రెడ్డి కి వివరించారు తలసాని. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సహకారంతో ఈ బావిని పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. చారిత్రక వారసత్వ సంపదకు పూర్వవైభాన్ని తెస్తున్న కెటిఆర్ కి ధన్యవాదాలు, అధికారులను అభినందనలు తెలిపారు ఇద్దరు మంత్రులు.
ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. ప్రధాని మోదీ, అమిత్ షా లు కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని రద్దుచేసుకొని ముందస్తుకు వెళ్తే తాముకూడా ముందస్తుకు సిద్దమేనని మంత్రి తలసాని తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకే బండి సంజయ్ చాలన్న అమిత్ షా...డ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.