Asianet News TeluguAsianet News Telugu

అడవుల్ని నరికినట్లే అధికారుల్ని నరికితే ఊరుకోబోం... ఎవ్వర్నీ వదిలిపెట్టం: మంత్రుల హెచ్చరిక

భద్రాచలం : అటవీభూములను పరిరక్షణ కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి.

First Published Nov 23, 2022, 3:01 PM IST | Last Updated Nov 23, 2022, 3:01 PM IST

భద్రాచలం : అటవీభూములను పరిరక్షణ కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా చండ్రగుంట మండలం బెండలపాడు పోడుభూముల వివాదంలో ఫారెస్ట్ రేంజ్ ఆపీసర్ (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావును స్థానిక గుత్తికోయలు వేట కొడవళ్ళతో నరికి అతి కిరాతకంగా హతమార్చారు. ఫారెస్ట్ అధికారి హత్యను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. స్వగ్రామం ఇర్లపూడిలో జరిగిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు స్వయంగా పాడెమోసారు. అధికారిక లాంఛనాలతో శ్రీనివాసరావు ఆంత్యక్రియలు ముగిసాయి. ఈ సందర్భంగా మంత్రులు పువ్వాడ, ఆలోల్ల మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులపై దాడులను సహించేది లేదన్నారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై దాడి చేసి అతి కిరాతకంగా చంపిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చిన గుత్తికోయలే ఈ దారుణానికి పాల్పడ్డారని... స్థానిక గిరిజనులతో ఎలాంటి సమస్య లేదన్నారు. వలసవచ్చిన వారు అడవులను విచక్షణ రహితంగా నరికినట్లే అధికారులను నరుకుతామంటే ఊరుకునేది లేదన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రులు హెచ్చరించారు.