బూర్జ్ కలిఫా, ఈపిల్ టవర్ స్థాయిలో తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్: మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. డిజిపి మహేందర్ రెడ్డి, సిపి సివి ఆనంద్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ క్రమంలో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న ఏజెన్సీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుండి మంత్రి హైదరాబాద్ అందాలను వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుత నిర్మాణమన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన తెలంగాణ మణిహారం ఇది అని అన్నారు. దుబాయ్ కు బూర్జ్ ఖలీఫా,ప్యారిస్ కు ఈఫిల్ టవర్ లాగే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రపంచ స్థాయి ప్రముఖ కట్టడాల సరసన నిలవనుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.