Asianet News TeluguAsianet News Telugu

కలెక్టర్లతో మంత్రి వేముల సమావేశం... డబుల్ బెడ్రూం ఇళ్ళపై కీలక ఆదేశాలు

హైదరాబాద్ : నిరుపేదల సొంతింటికలను నిజంచేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్ : నిరుపేదల సొంతింటికలను నిజంచేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్దిదారులకు అందించాలని... నిర్మాణంలో వున్న ఇళ్ళను వెంటనే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా వుండేలా చూడాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. గురువారం మంత్రి ప్రశాంత్ రెడ్డి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతి, లబ్దిదారుల ఎంపిక తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకమని అన్నారు.  100శాతం సబ్సిడీతో ఇల్లు నిర్మించి ఇస్తున్న ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్లాగ్ షిప్ ప్రొగాం అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.