నిజామాబాద్ లో భారీ వర్షాలు... సహాయక చర్యలపై మంత్రి కీలక సమావేశం

నిజామాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురయిన ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్‌, మేయర్‌, కమిషనర్‌, జడ్పీ చైర్మన్‌, అదనపు కలెక్టర్‌, నుడా చైర్మన్‌తో చర్చించారు.

First Published Jul 14, 2022, 1:43 PM IST | Last Updated Jul 14, 2022, 1:43 PM IST

నిజామాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుకు గురయిన ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్‌, మేయర్‌, కమిషనర్‌, జడ్పీ చైర్మన్‌, అదనపు కలెక్టర్‌, నుడా చైర్మన్‌తో చర్చించారు. మరో మూడురోజులు వర్షాలు కొనసాగే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీసారు. ప్రస్తుత పరిస్థితులు అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధిలతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని  బాబాన్ సాహెబ్ పహాడ్, మాలపల్లి, ఇంపీరియల్ గార్డెన్, గుపన్ పల్లి ప్రాంతాలను అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.