కడుపుకు అన్నం తినేవాడు ఇలాగేనా మాట్లాడేది..: ఎంపీ అరవింద్ పై మంత్రి వేముల ఫైర్

బాల్కొండ : బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు.

First Published Aug 18, 2022, 11:29 AM IST | Last Updated Aug 18, 2022, 11:29 AM IST

బాల్కొండ : బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని పలు చెక్ డ్యాములను కేంద్ర నిధులతో నిర్మించారనన నిజామాబాద్ ఎంపీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడాడని ఎద్దేవా చేసారు. ఇలా ఓ అబద్దాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని ప్రజలు నమ్మేలా చేయాలని చూస్తున్నాడని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అసలు మనిషన్నవాడు... అన్నం తినేవాడు ఇలా నమ్మి గెలిపించిన ప్రజలతో అబద్దాలాడి మోసపూరితంగా వ్యవహరించడని మంత్రి వేముల అన్నారు. ఇటువంటి వాళ్లు ఎందుకు పుట్టారురా అని అనిపిస్తుందంటూ ఎంపీ అరవింద్ పై ప్రశాంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేసారు.