సర్వాంగసుందరంగా ముస్తాబైన బన్సీలాల్ పేట మెట్లబావి

హైదరాబాద్ : ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు నిర్వహణలోపంతో కళతప్పగా తెలంగాణ ప్రభుత్వం వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

First Published Dec 2, 2022, 2:12 PM IST | Last Updated Dec 2, 2022, 2:12 PM IST

హైదరాబాద్ : ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు నిర్వహణలోపంతో కళతప్పగా తెలంగాణ ప్రభుత్వం వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని ప్రాచీన మెట్లబావి డంప్ యార్డ్ గా మారగా ప్రభుత్వం దాన్ని చరిత్రను గుర్తించి పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దిందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మెట్ల బావి పునరుద్ధరణ, అభివృద్ధి చేపట్టినట్లు తలసాని తెలిపారు. పునరుద్ధరణ పనులతో బావికి పూర్వ వైభవం వచ్చింది... పర్యాటకులను ఆకర్షించే విధంగా పరిసరాల అభివృద్ధి జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్ల బావి మారుతుందని తలసాని పేర్కొన్నారు. ఈ నెల 5న బన్సీలాల్ పేట మెట్లబావిని పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు స్థానిక మంత్రి బన్సీలాల్ పేటలో పర్యటించారు.