ఇంటింటి ఫీవర్ సర్వేను పరిశీలించిన మంత్రి తలసాని
ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మేదర బస్తీలో, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని MCH క్వార్టర్స్ లో ఫీవర్ సర్వే ను పరిశీలించారు మంత్రి తలసాని, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్.
ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మేదర బస్తీలో, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని MCH క్వార్టర్స్ లో ఫీవర్ సర్వే ను పరిశీలించారు మంత్రి తలసాని, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్. దేశంలో ఎక్కడా ఈ విధమైన సర్వే జరగడం లేదని, ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరుగుతుందని అన్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారని, తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా భారిన పడకుండా కాపాడు కోవాలని, సర్వే కు సహకరిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు.