Asianet News TeluguAsianet News Telugu

'అమృత వర్షిణి' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ : ప్రముఖ రచయితలైన కొత్తపల్లి మధుసూదన్ రావు దంపతులు రచించిన ''అమృత వర్షిణి'' పుస్తకాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. 

First Published Dec 5, 2022, 4:58 PM IST | Last Updated Dec 5, 2022, 4:58 PM IST

హైదరాబాద్ : ప్రముఖ రచయితలైన కొత్తపల్లి మధుసూదన్ రావు దంపతులు రచించిన ''అమృత వర్షిణి'' పుస్తకాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ అమీర్ పేటలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం మంత్రి తలసారి మహిళా శక్తి గురించి మాట్లాడారు. అసలు మహిళే లేకుంటే మన సమాజమే లేదని... ఆ మహిళలు చేస్తున్న సేవలు, త్యాగాలు ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. మన సంస్కృతి, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనం తెలుగింటి మహిళ అని అన్నారు. ప్రపంచ దేశాలలో భారతీయ మహిళకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి తలసాని కొనియాడారు.