బిజెపికి తలసాని వార్నింగ్... కవిత ఇంటివద్ద భారీ అనుచరులతో మంత్రి హల్ చల్
డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
డిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బిజెపి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ స్కాంలో కవిత కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజెపి ఆందోళన చేపట్టింది. సోమవారం సాయంత్రం బిజెవైఎం శ్రేణులు, బిజెపి మహిళా నాయకులు బంజారాహిల్స్ లోని కవిత ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కవిత ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.
కవిత ఇంటిపై బిజెపి నాయకులు దాడికి యత్నించడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. నగర కార్పోరేటర్లు, భారీగా కార్యకర్తలు, అనుచరులతో కలిసి కవిత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.