Asianet News TeluguAsianet News Telugu

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు... రోగులకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.

హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 15 రోజులపాటు (ఆగస్ట్ 8 నుండి 22 వరకు) రోజుకో కార్యక్రమం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దేశభక్తి, సామాజిక సేవా కార్యక్రమాలను కేసీఆర్ సర్కార్ నిర్వహిస్తోంది. ఈ వజ్రోత్సవ వేడుకలలో భాగంగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్ పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యావత్ దేశమే గర్వపడేలా భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వేచ్చాయుత భారతావనని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులను మనం స్మరించుకోవాలని తలసాని అన్నారు.

Video Top Stories