Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలి..

హైదరాబాద్ : కాచిగూడ లోని తుల్జా భవాని ట్రస్ట్ కు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

First Published Aug 23, 2023, 2:41 PM IST | Last Updated Aug 23, 2023, 2:41 PM IST

హైదరాబాద్ : కాచిగూడ లోని తుల్జా భవాని ట్రస్ట్ కు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దమ్ముంటే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని సవాల్ చేశారు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ధైర్యం మాకుంది. మీరేం చేశారో చెప్పగలరా? అని డిమాండ్ చేశారు. BJP కి అభ్యర్థులు లేరు, కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలకే పరిమితమైంది అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారన్నారు.