హైదరాబాద్ నడిబొడ్డున కశ్మీర్ అందాలు... చల్లటి మంచులో సేదతీరిన పర్యాటక మంత్రి

హైదరాబాద్: మండుటెండలతో సతమతమవుతున్న హైదరాబాద్ ప్రజలు చల్లగా సేదతీర్చుతూ సరదాగా గడిపేందుకు స్నో వరల్డ్ సిద్దమయ్యింది. కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలు టూరిజం కేంద్రాలను ప్రభుత్వ నిబంధనల మేరకు మూసివేయడం స్నో వరల్డ్ కూడా మూతపడింది. తాజాగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో టూరిజం శాఖ పూర్తిస్థాయిలో పర్యాటకులను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలోనే వేసవి ఎండల సమయంలో హైదరాబాద్ ప్రజలు సరదాగా గడిపేందుకు ఇష్టపడే స్నో వరల్డ్ కూడా పున:ప్రారంభమయ్యింది. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా  'స్నో వరల్డ్' ను పరిశీలించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మంచులో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. అలాగే బయట ఎండలు మండుతున్నా కశ్మీర్ లో మాదిరిగా స్నో వరల్డ్ లో చల్లటి వాతావరణం వుండటంతో వెచ్చటి స్వెట్టర్లు వేసుకుని మరీ కలియదిరిగారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 

First Published Mar 30, 2022, 10:53 AM IST | Last Updated Mar 30, 2022, 10:53 AM IST