Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఓటమి భరించలేకే... గంగులపై బిజెపి కుట్రలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తాళం పగలగొట్టి మరీ ఈడీ, ఐటీ అధికారులకు సోదాలు నిర్వహించడం దారుణమని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

First Published Nov 11, 2022, 10:56 AM IST | Last Updated Nov 11, 2022, 10:56 AM IST

హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తాళం పగలగొట్టి మరీ ఈడీ, ఐటీ అధికారులకు సోదాలు నిర్వహించడం దారుణమని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఓటమిని భరించలేకే బిజెపి పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్ని శిఖండి రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేశాన్ని ముంచి అనేక కుంభకోణాలు చేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటివారు లండన్ లో దర్జాగా తీరుగుతున్నారని... బ్యాంకులకు కన్నంవేసిన ఇలాంటి వాళ్లను మొదట పట్టుకురావాలని అన్నారు. దేశ ప్రగతిని ముందుకు తీసుకుపోతున్న తెలంగాణపై రాజకీయ కక్ష్యసాధింపుకు కేంద్రం పాల్పడుతోందని... అందుకే టీఆర్ఎస్ నాయకులపై ఈడి, సిబిఐ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మంత్రి గంగుల కమాలకర్ ఏదో దేశద్రోహం చేసినట్లు ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు చేయడమేంటని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.