Asianet News TeluguAsianet News Telugu

ఆదివాసి ఆడబిడ్డలతో... సాంప్రదాయ నృత్యాలు చేసిన మంత్రి సత్యవతి

హైదరాబాద్: అటవీ బిడ్డల జీవన విధానానికి ప్రతీకగా, అడవితో తాము మమేకమైన అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మాసబ్ ట్యాంక్ లో గల దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఘనంగా జరిగాయి. ఆదివాసీ మహిళలు గుస్సాడి, దింసా నృత్యాలతో కోళాహాలం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ కూడా గిరిజన ఆడబిడ్డలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు హాజరయ్యారు.

First Published Aug 9, 2021, 5:33 PM IST | Last Updated Aug 9, 2021, 5:33 PM IST