పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్లే.. ఈ రోజు కరోనా... సత్యవతిరాథోడ్
మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, పెద్ద తండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, పెద్ద తండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికి మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు అందించారు. కరోనా వైరస్ వస్తుందని ముందే తెలిసినట్లు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టి పల్లెలు, పట్టణాలు శుభ్రం చేయించారని, తద్వారా కరోనా వైరస్ కట్టడికి ఇదొక మంచి మార్గం అయిందన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని రైతులను మోసం చేయొద్దని, రైతు పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పారు.