కేసీఆర్ ముందుచూపుతోనే... ఆ విషయంతో ప్రపంచంలోనే తెలంగాణ టాప్: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది.

First Published Sep 8, 2022, 5:12 PM IST | Last Updated Sep 8, 2022, 5:12 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజధాని హైదరాబాద్ లో  24 కుల సంఘాలకు భూములు కేటాయించిన ప్రభుత్వం మరో 11 కులాలకు తాజాగా పట్టాలు అందించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన భూముల పట్టాలు, నిర్మాణాల కోసం అనుమతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రబలమైన మార్పులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకువచ్చిన పథకాలు, రాష్ట్ర అభివృద్ధి వల్ల ఒక్కో సామాజిక వర్గం మెల్లమెల్లగా బలపడుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడమే కేసీఆర్ పాలన ఎంత గొప్పగావుందో తెలియజేస్తుందని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.