Asianet News TeluguAsianet News Telugu

పాలు పూలు అమ్మేటీ వాడే పాటకు... బైక్ పైనే మల్లారెడ్డి డ్యాన్స్

మేడ్చల్ : మల్లారెడ్డి... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో  మరీముఖ్యంగా తెలంగాణలో తెలియని వారు వుండరు. మంత్రిగా, ప్రముఖ విద్యాసంస్థల అధినేతగానే కాదు మంచి మాటకారిగా మల్లారెడ్డికి పేరుంది.

First Published Apr 25, 2023, 5:26 PM IST | Last Updated Apr 25, 2023, 5:26 PM IST

మేడ్చల్ : మల్లారెడ్డి... ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో  మరీముఖ్యంగా తెలంగాణలో తెలియని వారు వుండరు. మంత్రిగా, ప్రముఖ విద్యాసంస్థల అధినేతగానే కాదు మంచి మాటకారిగా మల్లారెడ్డికి పేరుంది. పక్కా పల్లెటూరి మనిషిలా, కాస్త అమాయకత్వం మరికాస్త వినోదంతో కూడిన మాటలతో ఇప్పటికే మల్లారెడ్డి ఫేమస్ అయ్యారు. ఇటీవల పాలమ్మినా, పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మేడ్చల్ లో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో మల్లారెడ్డి సందడి చేసారు. పార్టీ జెండా ఆవిష్కరించిన మల్లారెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో పాలు పూలు అమ్మేటి వాడే మల్లన్న అంటూ సాగే పాట వినగానే మంత్రి జోష్ తో బైక్ పైనే డ్యాన్స్ చేసారు. ఇలా మల్లారెడ్డి తన వైరల్ మాటలతో రూపొందించన పాటకు చిందేసారు.