Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా.. బండి సంజయ్‌కి మల్లారెడ్డి సవాల్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. 

First Published Dec 23, 2022, 6:25 PM IST | Last Updated Dec 23, 2022, 6:25 PM IST

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న ఆయన.. మరో రాష్ట్రంలో తెలంగాణ తరహా అభివృద్ధి పథకాలను చూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.  బండి సంజయ్‌ తనని ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులకు న్యాయం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రైతును రాజును చేశారని మల్లారెడ్డి ప్రశంసించారు.