Asianet News TeluguAsianet News Telugu

జలవిప్లవంతో పాటు.. త్వరలో మరో నాలుగు విప్లవాలు.. కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించిన మంత్రి కేటీఆర్‌  ఫీడర్ ఛానెల్‌ పూడిక తీత, చెక్‌డ్యామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించిన మంత్రి కేటీఆర్‌  ఫీడర్ ఛానెల్‌ పూడిక తీత, చెక్‌డ్యామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  రూ.2 కోట్లతో కొల్లమద్ది గ్రామంలో ఎగువ మానేరు ప్రధాన ఫీడర్ ఛానెల్‌లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. నర్మాలలో రెండు చెక్‌డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్మాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేసి, అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. అవెంటనే గంభీరావుపేటలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లమద్ది గ్రామంలోegs కార్మికులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనులు చేపట్టేప్పుడు విధిగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. జలహితం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నర్మాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 

Video Top Stories