కేటీఆర్ అనే నేను.. కంటైన్మెంట్ జోన్ ప్రజలకు భరోసా ఇస్తున్నాను...
ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటెన్న్మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ తారకరామారావు సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురితో ఆయన మాట్లాడారు. ఆయా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు. కంటైన్ మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. కరోనా వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, కంటైన్ మెంట్ జోన్ లో ఉన్న స్థానికులకు కాస్తంత భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు.