రంగనాయక సాగర్ లోకి ఉరుకులు పరుగులతో.. కాళేశ్వరం జలాలు..
సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట నియోజకవర్గం చందళాపూర్ గ్రామం వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం ప్రారంభోత్సవం జరిగింది.
సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట నియోజకవర్గం చందళాపూర్ గ్రామం వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం ప్రారంభోత్సవం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి రంగనాయక సాగర్ లో నిల్వచేస్తారు. కాళేశ్వరం నుంచి సుమారు 220 కిలో మీటర్లు ప్రయాణం చేసి సాగునీరు రంగనాయక సాగర్‌కు చేరుకున్నాయి. శుక్రవారం ఈ ప్రాజెక్ట్ ను కేటీఆర్, హరీష్ రావులు ప్రారంభించారు. దీనికి ముందు రంగనాయక స్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.