Asianet News TeluguAsianet News Telugu

పల్లా రాజేశ్వర్ రెడ్డికి అసెంబ్లీ ప్రాంగణంలో ఘన సన్మానం

వరంగల్- ఖమ్మం - నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న టిఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో ఘన సత్కారం లభించింది.

వరంగల్- ఖమ్మం - నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న టిఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో ఘన సత్కారం లభించింది. శాసన మండలికి వచ్చిన ఆయనకు అసెంబ్లీ ప్రాంగణంలోనే రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, కడియం శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాలువాతో సన్మానించి అభినందించారు.