Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ దళిత మంత్రిని అవమానించారంటూ ప్రచారం... కొప్పుల ఈశ్వర్ సీరియస్

హైదరాబాద్ : మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారంటూ జరుగుతున్న ప్రచారం మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. 

First Published Nov 4, 2022, 2:46 PM IST | Last Updated Nov 4, 2022, 2:46 PM IST

హైదరాబాద్ : మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారంటూ జరుగుతున్న ప్రచారం మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. తనను ముఖ్యమంత్రి దురుసుగా పక్కకు లాగారంటూ... దళితుడిని కాబట్టే పక్కన కూర్చోబెట్టుకోలేదంటూ ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. మంత్రినే కాదు యావత్ దళిత సమాజాన్నే సీఎం అవమానించారంటూ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఆపాలని... లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.