Asianet News TeluguAsianet News Telugu

రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల గోల్ మాల్ వెనకున్నది మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే చందర్:గోనె ప్రకాష్

రామగుండం ఎరువుల కర్మాగారం జాబ్ స్కాం లో స్థానిక ఎమ్మెల్యే తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.

First Published Aug 27, 2022, 4:52 PM IST | Last Updated Aug 27, 2022, 5:04 PM IST

రామగుండం ఎరువుల కర్మాగారం జాబ్ స్కాం లో స్థానిక ఎమ్మెల్యే తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే ఎరువుల కర్మాగారం లో ఉద్యోగాల గోల్ మాల్ గురించి చెప్పిన ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితుల విషయం మావోయిస్టుల వరకు చేరిందని... బాధితులు వారికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బాధితుల పక్షాన తాను ముందుగానే హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని బాధితులకు అప్పుడే న్యాయం చేస్తే ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ముంజ హరీష్ మృతికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కారణమని వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని లేనిపక్షంలో రామగుండం రణరంగంగా మారే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.