Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో భారీ అంబేద్కర్ విగ్రహం... పరిశీలించిన మంత్రులు వేముల, కొప్పుల

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

First Published Nov 28, 2022, 4:19 PM IST | Last Updated Nov 28, 2022, 4:19 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. హుస్సెన్ సాగర్ ఒడ్డున నెక్లెస్ రోడ్డులో 125 అడుగుల ఎత్తులో అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సర్కార్ భావించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రారంభమైన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి.   

ఈ సందర్భంగా మంత్రులు ఆర్ ఆండ్ బి అధికారులతో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. విగ్రహ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని... వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి పూర్తిచేస్తామని మంత్రులు తెలిపారు. వచ్చేఏడాది ఏప్రిల్ లో ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు.