వాట్పప్ లో వినతి.. గూగుల్ పే లో సాయం.. కొప్పుల ఈశ్వర్ పెద్దమనసు...
ముంబయి వలస కార్మికులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆర్థిక సాయం అందించారు.
ముంబయి వలస కార్మికులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆర్థిక సాయం అందించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుండి ముంబాయి కి ఉపాధి కోసం వెళ్లిన వారు, లాక్ డౌన్ తో అక్కడే ఉండి, సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఫోన్ లో మాట్లాడారు. అలాగే వారి ఫోటోలు, వీడియోలు వాట్సప్ లో మంత్రి కి పంపించారు. వారి పరిస్థితి తెలుసుకున్న కొప్పుల ఈశ్వర్ 91,000 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గూగుల్ పే ద్వారా అందించారు.