పేద బ్రాహ్మణులకు అండగా జగదీశ్వర్ రెడ్డి.. 108 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ..
కరోనా కరువులో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసట గా నిలిచారు.
కరోనా కరువులో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసట గా నిలిచారు. లాక్ డౌన్ నేపద్యంలో నిత్యపూజలు, పౌరోహిత్యంపై ఆధారపడిన కుటుంబాలకు బియ్యంతో సహా నిత్యావసర సరుకులనందించి ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 108 బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం ఇతర నిత్యావసర సరుకులను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి దాతృత్వానికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆశీర్వచనంతో కృతజ్ఞతలు తెలిపుకున్నారు.