తెలంగాణ అసెంబ్లీలో మంత్రి జగదీష్ రెడ్డి భర్త్ డే సెలబ్రేషన్స్
హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇవాళ (సోమవారం) పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇవాళ (సోమవారం) పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. మంత్రుల నివాస సముదాయంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి. అనంతరం నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో కూడా మొక్కలు నాటారు. అక్కడినుండి అసెంబ్లీకి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకను టిఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష కార్యాలయంలో జరిపారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో జగదీష్ రెడ్డి కేక్ కట్ చేసారు.