Asianet News TeluguAsianet News Telugu

కడెం ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్

తెలంగాణతో  పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ప్రమాదకరంగా మారింది.

First Published Jul 13, 2022, 12:08 PM IST | Last Updated Jul 13, 2022, 12:08 PM IST

తెలంగాణతో  పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ప్రమాదకరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్థ్యం 3లక్షల క్యూసెక్కులు కాగా ఎగువనుండి 5లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం, సహాయక సిబ్బంది సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్ట్ వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.  ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి కడెం ప్రాజెక్ట్ ను పరిశీలించారు. కడెం ప్రాజెక్ట్ వద్ద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. దగ్గరుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం మంత్రిని ఆదేశించారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో తో పాటు మంపు గ్రామాల్లో చేపట్టిన సహాయక చర్యల గురించి సీఎంకు మంత్రి వివరించారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.