Asianet News TeluguAsianet News Telugu

ఆల్ రౌండర్ గా హరీష్ రావు... పోలీస్ టీ 20 క్రికెట్ లీగ్..

సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. 


సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై టాస్ వేసిన అనంతరం కాసేపు క్రికెట్ ఆటలో భాగంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి, మరో ఓవర్ బౌలింగ్ చేశారు. ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేసి విన్నూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్ శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేయడం అక్కడి క్రీడాకారులతో పాటు వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

Video Top Stories