Harish Rao Video : ఇవేం పాఠాలు: టీచర్ గా మారిన హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా, కంది జిల్లా పరిషత్ పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లా, కంది జిల్లా పరిషత్ పాఠశాలలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మద్యాహ్నభోజనాన్ని మంత్రి పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులతో మంత్రి హరీష్ రావు కాసేపు మాట్లాడారు. వారిని ఆయా సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి ప్రశ్నించారు. అయితే చాలామంది తెలుగులో పేర్లు కూడా రాయలేకపోవడం, ఎక్కాలు రాకపోవడంతో హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చదువులతో ప్రపంచంతో ఎలా పోటీపడతారని మంత్రి ప్రశ్నించారు.