Asianet News TeluguAsianet News Telugu

రుణమాఫీ ఎవరికి మిస్సవ్వదు: హరీశ్ రావు

కొద్దిమంది రైతుల ఆధార్ నెంబర్లు లేకపోవడం వల్ల రుణమాఫీ మొత్తం వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. 

కొద్దిమంది రైతుల ఆధార్ నెంబర్లు లేకపోవడం వల్ల రుణమాఫీ మొత్తం వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. అకౌంట్లలో డబ్బులు పడని రైతుల ఆధార్ నెంబర్లను ఏఈవోల ద్వారా  సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి గుర్తుచేశారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆధార్ నెంబర్లు సేకరించిన తర్వాత వారి అక్కౌంట్లలో డబ్బులు వేయాలని సూచించినట్లు తెలిపారు. జూన్ 5వ తేదీన బ్యాంకర్స్ మీటింగ్ పెట్టాలని నిన్న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇదే సమావేశంలో  కొవిడ్ నేపధ్యంలో రైతులకు, మున్సిపాలిటీలోని స్ట్రీట్ వెండర్స్, ఎం.ఎస్.ఎం.ఈ లకు ఇవ్వాల్సిన లోన్లు, వడ్డీ రాయితీలపైన  సమీక్ష జరపాలని సూచనలిచ్చామన్నారు. రైతు రుణ మాఫీ 25 వేల రూపాయలు ఏక మొత్తం ఒకే సారి మాఫీ చేయాలని సీఎం నిర్ణయించారని హరీశ్ తెలిపారు. ఇందు కోసం 1200 కోట్లు విడుదల చేశామని, ఆ నిధులను సకాలంలో రైతుల అక్కౌంట్లలో పడేలా కలెక్టర్లను రివ్యూ చేయాలని కోరామని మంత్రి వెల్లడించారు.  జిల్లాలో 1 లక్షా 76 వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని,  312 కోట్లు  ఇందుకు చెల్లించామని, ఇంకా 12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. దీనిని రెండు రోజుల్లో క్లియర్ చేసతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.  మెదక్ జిల్లాలో  ఇంత స్థాయిలో ధాన్యం కొనలేదని, అయినా  రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో డబ్బులు చెల్లించడం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ విషయంలో తీవ్రంగా కృషి చేసిన  ఐకేపీ, మహిళా సంఘాలు, అధికారులను, సోసైటీ ఛైర్మన్లను మంత్రి అభినందించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా శనగలు, మక్కలు, కందులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేశామని.. మక్కలకు ధర లేకున్నా 1735 రూపాయలు చెల్లించామని హరీశ్ రావు తెలిపారు. 

Video Top Stories