Asianet News TeluguAsianet News Telugu

పొద్దున క్రికెటర్... మద్యాహ్నానికి టీచర్ అవతారమెత్తిన మంత్రి హరీష్

మెదక్ జిల్లా పాపన్న పేట మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాస్టర్ అవతారమెత్తారు.  

మెదక్ జిల్లా పాపన్న పేట మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాస్టర్ అవతారమెత్తారు.  తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టు లలో విద్యార్థుల ప్రావీణ్యతను పరీక్షించారు మంత్రి హరీశ్.డాక్టర్ కావాలంటే ‌ఏం చదవాలి... డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా....ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తావా? అంటూ విద్యార్థుల మనోగతాన్ని అడిగి‌ తెలుసుకున్నారు మంత్రి. పోలీసు అవుతాన్న విద్యార్థితో...పోలీసయితే ఏం చేస్తావని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై మాట్లాడమని విద్యార్థులను కోరారు మంత్రి. తెలుగు నుడికారాలు , జాతీయాలు, సామెతలు, సొంత వాక్యాలపై ప్రశ్నలు వేశారు మంత్రి హరీష్ రావు.

కరోనా అనంతరం పాఠశాల ఎలా నడుస్తుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. కరోనా వల్ల‌ చదువు కోల్పాయారా? అని ఆరా తీశారు మంత్రి. మధ్యాహ్న బోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థులను బాగా సానబట్టాలని‌ ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి‌ హరీష్ రావు. 

Video Top Stories