Asianet News TeluguAsianet News Telugu

ఆయనకు పదవి... ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన గౌరవం: హరీష్ రావు

Apr 16, 2021, 5:02 PM IST

హైదరాబాద్: తమ నాయకుడు కేసీఆర్ పై విశ్వాసం, టీఆరెస్ పార్టీ పై నమ్మకం ఉన్న వ్యక్తి  ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి ఆయనని.. అలాంటి నాయకుడికి రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ గా నియమించడం సంతోషదాయకం అన్నారు. దేవేందర్ అన్నకు ఇచ్చిన పదవి ఉమ్మడి మెదక్ జిల్లాకు దక్కిన గౌరవం అన్నారు. ఇలాగే పార్టీలోని ప్రతి ఒక్కరికి సముచితమైన స్థానం దక్కుతుందని... ఉద్యమకారులకు కూడా సరైన అవకాశాలు వస్తాయన్నారు. 

తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ గా ఇవాళ(గురువారం) దేవేందర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ,వేముల ప్రశాంత్ రెడ్డి, మహిళ కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి హాజరయ్యారు. 

Video Top Stories