హనుమకొండలో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

హన్మకొండ : కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ చీఫ్ విప్ భాస్కర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...నిత్యం కార్మికుల మధ్య శ్రమ జీవిలా కష్టపడే నాయకుడు వినయ్ భాస్కర్ అన్నారు. ఆయన ఒక నెల మొత్తం కార్మికుల సంక్షేమ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందనీయం అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కనీసం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ఉజ్వల్ పథకం కింద సిలిండర్లు ఇచ్చామని ప్రచారమే తప్ప ఇచ్చింది లేదు. ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పోయ్యిల కట్టెలు కొంటున్నారు. నూనెల ధరలు ఆకాశాన్నంటాయి. కార్మికులకు ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కెసిఆర్ ది.. భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.Health City కి వెళ్ళాం 12 వందల కోట్లతో 24 అంతస్థుల భవనం. 2 వేల పడకలు, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందులో ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నం. ఏడాది లోగా ఆ హాస్పిటల్ ను పూర్తి చేస్తాం. మరో ఆరు నెలల్లో అన్ని రకాల పరికరాలు అందిస్తాం.హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదు. ఈ హెల్త్ క్యాంప్ ద్వారా కార్మికులు లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.

First Published May 10, 2022, 12:38 PM IST | Last Updated May 10, 2022, 12:38 PM IST