Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి: మంత్రి హరీష్

సంగారెడ్డి : తెలంగాణలో ఇప్పటికే భారీ ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమతులివ్వగా మరో 28వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులివ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

First Published Sep 1, 2022, 2:39 PM IST | Last Updated Sep 1, 2022, 2:39 PM IST

సంగారెడ్డి : తెలంగాణలో ఇప్పటికే భారీ ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమతులివ్వగా మరో 28వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులివ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రకటించారు. గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చామని... నియామక ప్రక్రియ కొనసాగుతోందని హరీష్ తెలిపారు. తాజాగా గ్రూప్-2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి అనుమతులిచ్చామని తెలిపారు. ఇక మరో వారంరోజుల్లో గ్రూప్4, డిఎస్సీ వంటి 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నట్లు హరీష్ ప్రకటించారు.తెలంగాణలో ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసామని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఇక మరో 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సిద్దంగా వున్నామన్నారు. ఇలా మొత్తం 2 లక్షల 10 ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుందని మంత్రి హరీష్ తెలిపారు.