కేసీఆర్ ను సాదుకుంటారా లేక సంపుకుంటారా..!: మునుగోడు ఓటర్లతో హరీష్ రావు

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇవాళ చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలన్ని మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్లాయి.

First Published Nov 1, 2022, 5:13 PM IST | Last Updated Nov 1, 2022, 5:13 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇవాళ చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలన్ని మరింత జోరుగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇలా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కీలక నాయకులందరితో ప్రచార రంగంలోకి దింపింది. ఇలా ఆ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు నాంపల్లి మండలకేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ... గతకొద్ది రోజులుగా అన్ని పార్టీల ప్రచారాన్ని చూసారు కాబట్టి ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. మనకు అన్నం పెట్టినోడు ఎవరో... సున్నం పెట్టెటోడు ఎవరో గుర్తించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బిజెపి బట్టేబాజ్ గాళ్ల మాటలింటే గోస పడతారని అన్నారు. ప్లోరైడ్ భూతాన్ని తరిమి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ను సాదుకుంటారో... సంపుకుంటారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇంటింటికి ఎలాగయితే నీళ్లు ఇచ్చామో అలాగే పొలాలకు సాగునీరు ఇస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.