బిజెపి పాలిత రాష్ట్రంలో ఇదీ ప్రజల పరిస్థితి... కర్ణాటక గ్రామంలో మంత్రి హరీష్

సంగారెడ్డి: బిజెపి అధికారంలో వున్న కర్ణాటక రాష్ట్రంలో పాలన, ప్రజాసంక్షేమం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు. 

First Published Feb 12, 2021, 4:01 PM IST | Last Updated Feb 12, 2021, 4:02 PM IST

సంగారెడ్డి: బిజెపి అధికారంలో వున్న కర్ణాటక రాష్ట్రంలో పాలన, ప్రజాసంక్షేమం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా  నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో  గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లే సందర్భంగా తెలంగాణ-కర్దాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా బీదర్ లోని  ఓ గ్రామంలో తన వాహనాన్ని ఆపి గ్రామస్థులతో ముచ్చటించారు ఆర్థిక మంత్రి. ఈ సందర్భంగా విద్యుత్, ప్రజలకు అందుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకుని తెలంగాణ పాలన ఎలా సాగుతుందో కూడా అడిగారు. తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నా మంత్రి హరీశ్ రావు.