Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బిజెపి ఈడీ, ఐటీ కుట్రలు నడవవు...: కవిత వ్యవహారంపై మంత్రి హరీష్

 జగిత్యాల : డిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వుండటం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

First Published Dec 2, 2022, 12:41 PM IST | Last Updated Dec 2, 2022, 12:41 PM IST

 జగిత్యాల : డిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వుండటం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లిక్కర్ స్కామ్ తో కవితకు సంబంధాలున్నాయని ఈ రిమాండ్ రిపోర్ట్ తో తేలిపోయిందని ప్రతిపక్షాలు అంటుంటే... రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కవితను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో రైడింగులు చేయించే బిజెపి రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసన్నారు. అంతేకాదు బిజెపి వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా వుంటాయంటూ పరోక్షంగా వైఎస్ షర్మిలకు చురకలు అంటించారు.  యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల్లో మీ బాణాలు, పార్టీలు, ఈడీలు, ఐటీలు కుట్రలు నడుస్తాయి... కానీ ఉద్యమాల గడ్డ తెలంగాణలో అలాంటివి నడవవని హరీష్ అన్నారు. మంత్రి హరీష్ ఎమ్మెల్సీ కవితతో కలిసి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాలలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవన సముదాయంతో పాటు జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాణాలను పరిశీలించిన మంత్రి హరీష్ బహిరంగ ఏర్పాట్లను కూడా పరిశీలించారు.