కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు

జగిత్యాల:  తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు సతీసమేతంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. 

First Published May 4, 2022, 10:07 AM IST | Last Updated May 4, 2022, 10:07 AM IST

జగిత్యాల:  తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు సతీసమేతంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. భార్యతో కలిసి ఆలయానికి విచ్చేసిన మంత్రి హరీష్ కు  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో దగ్గరుండి మంత్రి దంపతులకు స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించారు.  అనంతరం హరీష్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ తదితరులు హరీష్ వెంట వున్నారు.