హైదరాబాద్ తర్వాత కరీంనగరే...: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ :కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి, మానే రివర్ ఫ్రంట్ నిర్మాణాలను చేపట్టామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ :కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి, మానే రివర్ ఫ్రంట్ నిర్మాణాలను చేపట్టామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. డిసెంబర్ 31లోగా ప్రజలకు అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జ్ తీసుకువవస్తామని మంత్రి అన్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించిన మ్యాప్ ను మంత్రి పరిశీలించారు.