Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో ఈడి, ఐటీ రైడ్స్... విదేశాల నుండి హుటాహుటిన తిరిగొచ్చిన మంత్రి గంగుల

హైదరాబాద్ :  గ్రానైట్ మైనింగ్ లో అక్రమాలు,   మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఫెమా యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదుల నేపథ్యంలో కరీంనగర్, హైదరాబాద్ లో గ్రానైట్ వ్యాపారులపై ఈడీ,

First Published Nov 10, 2022, 10:36 AM IST | Last Updated Nov 10, 2022, 10:35 AM IST

హైదరాబాద్ :  గ్రానైట్ మైనింగ్ లో అక్రమాలు,   మనీ లాండరింగ్ కు పాల్పడుతూ ఫెమా యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదుల నేపథ్యంలో కరీంనగర్, హైదరాబాద్ లో గ్రానైట్ వ్యాపారులపై ఈడీ, ఐటీ సంయుక్తంగా దాడులు చేపడుతోంది. ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం మంత్రి ఇంటికి తాళం వుండటంతో దాన్ని పగలగొట్టి ఇంట్లోకి చేరుకున్న అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో దుబాయ్ లో వున్న మంత్రి గంగుల హుటాహుటిన రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తన ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ, ఈడి దాడులపై మంత్రి స్పందించారు. తాను విదేశాల్లో వుండగా ఇంటివద్దకు చేరకున్న ఈడి, ఐటి అధికారులు సమాచారమిచ్చారని... ఇంటి తాళాలు తీసి సోదాలు చేసుకోవాలని వారికి తానే చెప్పినట్లు గంగుల పేర్కొన్నారు. ఇంట్లోని ప్రతి లాకర్ ను తెరిచి చూసుకోవచ్చంటూ ధర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులకు పూర్తి సహకారం అందించానని తెలిపారు. ఈ సోదాల్లో ఎంత డబ్బు దొరికిందో... ఇంకా ఏమయినా దొరికాయా అన్నది దర్యాప్తు సంస్థలే వెల్లడించాలన్నారు. సంపూర్ణ దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ఈడి, ఐటీ సంస్థలదేనని అన్నారు. తన ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో దగ్గరుండాల్సిన బాధ్యత వుందని... దర్యాప్తుకు సహకరించాలన్న ఉద్దేశ్యంతోనే హుటాహుటిన దుబాయ్ నుండి తిరిగి వచ్చినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.