ఈటలా... నడ్డాను ఆ మంత్రిత్వ శాఖ కావాలని అడిగావా?: గంగుల కమలాకర్
కరీంనగర్: నిజంగానే ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవం ఉంటే ఢిల్లిలో ఎందుకు తాకట్టు పెట్టావు...
కరీంనగర్: నిజంగానే ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవం ఉంటే ఢిల్లిలో ఎందుకు తాకట్టు పెట్టావు... కారు ఓనర్ అన్న ఆయన డిల్లీకి వెళ్లి క్లీనర్ అయ్యారని మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమించుకుని ఆత్మగౌరవం అనడం కాదని... భూములని రిటర్న్ చేస్తే నిజంగా ఆత్మగౌరవం ఉన్నట్లని అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా దగ్గర నల్ల చట్టాల గూర్చి మాట్లాడినావా? లేదా కేంద్రంలో వెనుకబడిన తరుగతుల కోసం ఒక మంత్రిత్వ శాఖ అడిగినావా? అని ఈటలను ప్రశ్నించారు గంగుల.